కావలసిన పధార్థాలు :
మినపపప్పు : కప్పు
బియ్యం : రెండు కప్పులు
అన్నం లేదా అటుకులు : కొద్దిగా
మెంతులు : టీ స్పూన్లు
శనగపప్పు : 2 టేబుల్ స్పూన్లు
చీజ్ : 100 గ్రా,
క్యారెట్ తురుము : అరకప్పు
పచ్చిమిర్చితురుము : పావుకప్పు
ఉప్పు : తగినంత
నూనె లేదా నెయ్యి : సరిపడా
తయారీచేయు విధానం :
ముందురోజే మినపప్పు, బియ్యం, మెంతులు, సెనగపప్పు ఎనిమిది గంటలు నానబెట్టుకుని రుబ్బుకుని వుంచాలి. రుబ్బేటప్పుడు కాస్త అన్నం లేదా నానేసిన అటుకులు కూడా వేయాలి. ఉప్పు కలిపి పిండిని పులియనివ్వాలి.
మర్నాడు మామూలుగానే పెనంమీద దోశ వేసుకుని నూనె లేదా నెయ్యి వేస్తూ కాలనివ్వాలి. కాస్త కాలిన తరువాత ఛీజ్ తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తురుము పైన చల్లి ఏదైనా చట్నీతో వేడివేడిగా వడ్డించాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: